Overloaded Trucks: రవాణా అధికారి అవతారం ఎత్తిన స్పీకర్!
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:18 AM
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం రవాణా శాఖ అధికారి అవతా రం ఎత్తారు.
ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలను ఆపి..బిల్లులను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
ఆయన ఆదేశాలతో ఏడు లారీలు సీజ్
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా), జూలై 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం రవాణా శాఖ అధికారి అవతా రం ఎత్తారు. విశాఖపట్నంలోని గంగవరం పోర్టు నుం చి తన నియోజకవర్గం నర్సీపట్నంలోని మాకవరపాలెం మండలంలో గల పయనీర్ కంపెనీకి ఓవర్ లోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపి, బిల్లులు పరిశీలించారు. టిప్పర్ల వల్ల రోడ్లు, తాళ్లపాలెం వంతెన దెబ్బతింటున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గతంలో సంబంధిత శాఖ అధికారులను పలుమార్లు ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీవో అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మాకవరపాలెం మండలం రాజుపేట సమీపంలో రోడ్డుపై నిల్చొని.. అధిక లోడుతో వస్తున్న టిప్పర్లను ఆపి బిల్లులు పరిశీలించారు. ఈ క్రమంలో పయనీర్ కంపెనీకి ముడిసరుకుతో వెళ్తున్న సుమారు 50 లారీలు నిలిచిపోయాయి. విషయం తెలిసి పోలీసులు, పలు శాఖల అధికారులు అక్కడకు చేరుకున్నారు. అధిక లోడుతో వస్తున్న టిప్పర్ల కారణంగా తాళ్లపాలెం వంతెన కూలిపోయే ప్రమాదం ఉంద ని స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మాకవరపాలెం పోలీసులు 7 లారీలను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. అధికారుల అలసత్వం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి కనిపించడంతో సమస్యను పరిష్కరించేందుకు తానే స్వయంగా రావాల్సి వచ్చిందని అయ్యన్న అన్నారు. ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని, స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News