Terrorist Noor Case: ఉగ్రవాది నూర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:58 AM
Terrorist Noor Case: నూర్ ధర్మవరం పట్టణం లోనకోటలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూర్ 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు తేలింది. నూర్ మహమ్మద్ ఫోన్లోని వాట్సాప్ గ్రూపుల్లో ఒసామా బిన్ లాడెన్, ఆల్ ఖైయిదా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వీడియోలను పోలీసులు గుర్తించారు.
నూర్ ధర్మవరం పట్టణం లోనకోటలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన అంశం నూర్ మొహమ్మద్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుల్లో చర్చకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
నూర్ మహ్మద్ ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు అతడ్ని మరింత లోతుగా విచారించేందుకు సోమవారం కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కాగా, నూర్ మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
జమ్మూకాశ్మీర్‌లో మరో విషాదం.. క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి..
మానవ మృగం.. వృద్ధురాలైన తల్లిని కూడా వదల్లేదు..