65 Year Old Mother: మానవ మృగం.. వృద్ధురాలైన తల్లిని కూడా వదల్లేదు..
ABN , Publish Date - Aug 17 , 2025 | 09:30 AM
65 Year Old Mother: ఇంటికి వచ్చిన తర్వాత ఫిరోజ్ తల్లిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా ఆమెను కొట్టాడు. దీంతో భయపడిపోయిన తల్లి పెద్దకూతురు ఇంటికి వెళ్లింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మానవ మృగంలాంటి కొడుకు కన్న తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని అంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడి సోదరి తెలిపిన వివరాల మేరకు.. 65 ఏళ్ల బాధిత మహిళ 72 ఏళ్ల తన భర్తతో కలిసి జులై 25వ తేదీన దైవ దర్శనం కోసం సౌదీ అరేబియా వెళ్లింది. వీరితో పాటు కూతురు కూడా వెళ్లింది. వాళ్లు సౌదీ పర్యటనలో ఉన్నప్పుడే వారి కొడుకు మహ్మద్ ఫిరోజ్ అలియాస్ సుహెల్ తండ్రికి ఫోన్ చేశాడు. తల్లి క్యారెక్టర్ మంచిది కాదని, వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి ఆమెకు విడాకులు ఇవ్వాలని తండ్రితో చెప్పాడు.
ఆగస్టు 11వ తేదీన వారు సౌదీనుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫిరోజ్ తల్లిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా ఆమెను కొట్టాడు. దీంతో భయపడిపోయిన తల్లి పెద్దకూతురు ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులు అక్కడే ఉంది. తర్వాత ఇంటికి వచ్చేసింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రైవేట్‌గా మాట్లాడాలని చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి తీసుకెళ్లిన తర్వాత తలుపు వేశాడు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.
కొడుకు చేసిన దారుణం గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేకపోయింది. కూతురితో కలిసి నిద్రపోయేది. ఆ దుర్మార్గుడు ఆగస్టు 14వ తేదీన కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతడిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడు ఆమెను రూములో బంధించి అత్యాచారం చేశాడు. గతంలో ఆమె చేసిన తప్పుడు పనులకు ఇప్పుడు శిక్ష వేస్తున్నా అని చెప్పాడు. ‘నేను నీ తల్లిని.. వదిలి పెట్టు’ అని ఆమె ఎంత బతిమలాడినా వదల్లేదు’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..