Share News

YS Sharmila Deadline: ఉక్కు యాజమాన్యానికి షర్మిల డెడ్‌లైన్‌

ABN , Publish Date - May 07 , 2025 | 04:35 AM

ఉక్కు కర్మాగారం తొలగించిన కాంట్రాక్టు కార్మికులను 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డెడ్‌లైన్‌ ఇచ్చారు. లేకపోతే 21 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు

YS Sharmila Deadline: ఉక్కు యాజమాన్యానికి షర్మిల డెడ్‌లైన్‌

  • 20 లోగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), మే 6(ఆంధ్రజ్యోతి): తొలగించిన కాంట్రాక్టు కార్మికులను ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఈ నెల 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో 21 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హెచ్చరించారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం జంక్షన్‌లో కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. కార్మికులకు సంఘీభావంగా ఉదయం 11.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ దీక్షలో పాల్గొన్నారు. ఉక్కు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌ ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Updated Date - May 07 , 2025 | 04:35 AM