Nidigunta Aruna: వెలుగులోకి వస్తున్న నెల్లూరు లేడీ డాన్ అరాచకాలు..
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:17 PM
నెల్లూరు లేడీ డాన్‌గా ప్రచారం పొందుతున్న నిడిగుంట అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అరుణ బాధితులు ప్రస్తుతం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అరుణ గిరిజనులను సైతం వదలకుండా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
నెల్లూరు లేడీ డాన్‌గా ప్రచారం పొందుతున్న నిడిగుంట అరుణ (Nidigunta Aruna) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అరుణ బాధితులు ప్రస్తుతం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అరుణ గిరిజనులను సైతం వదలకుండా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి 17 మంది గిరిజనుల నుంచి 2.10 లక్షల రూపాయలు తీసుకుని వారిని మోసగించింది (AP News).
తాజాగా అరుణపై బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అరుణ అరాచకాలు వెలుగు చూడడంతో చాలా మంది విస్తుపోయారు. కారు ఢిక్కీలో దాక్కుని పారిపోతున్న ఆమెను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తాజాగా కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..