Share News

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు పూర్తి

ABN , Publish Date - May 31 , 2025 | 09:06 PM

PSR Anjaneyulu: ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారంటూ గతంలో పీఎస్సాఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏపీపీఎస్సీలో అనేక అవకతవలకు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు అయ్యాయి.

PSR Anjaneyulu: సీనియర్ ఐపీఎస్ అధికారి  పీఎస్సార్ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు పూర్తి
PSR Anjaneyulu

విజయవాడ: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బీపీలో హెచ్చు తగ్గులు ఉండటంతో పీఎస్సార్‌ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఆంజనేయులుకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రి గుండె వైద్య వార్డులో ఆయనను ఉంచారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు వైద్యులు పర్యవేక్షించారు.


రేపు యాంజియో చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేశారు. అయితే, తాను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండనంటూ ఆయన మరోసారి వాగ్వివాదానికి దిగారు. రాత్రి అక్కడే పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు కోరినా వినలేదు. సోమవారం వస్తానని వార్డు నుంచి బయటకు వచ్చేశారు. ఎంత చెప్పినా పీఎస్సార్ ఆంజనేయులు వినకపోవటంతో అధికారులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు.

కాగా.. ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారంటూ గతంలో పీఎస్సాఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏపీపీఎస్సీలో అనేక అవకతవలకు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి

గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి.. మహిళపై దారుణం..

టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై పబ్‌లో దాడి..

Updated Date - May 31 , 2025 | 09:15 PM