Share News

Swachh Bharat: స్వచ్ఛభారత్‌లో స్వయం సహాయక సంఘాలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:56 AM

స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఘనవ్యర్థాల నిర్వహణకు డ్వాక్రా సంఘాల సేవలు వినియోగించుకోవాలని

Swachh Bharat: స్వచ్ఛభారత్‌లో స్వయం సహాయక సంఘాలు

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఘనవ్యర్థాల నిర్వహణకు డ్వాక్రా సంఘాల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద 10 జిల్లాలను ఇప్పటికే ఎంపిక చేసింది. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, వైఎ్‌సఆర్‌ కడప జిల్లాల్లోని ఒక్కో పంచాయతీని ఎంపిక చేసి ఈ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. చెత్త సేకరణ, తడి, పొడి చెత్తగా విడగొట్టడం, కంపోస్టింగ్‌ తదితర ప్రక్రియపై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించనున్నారు. ఘనవ్యర్థాల నిర్వహణలో భాగంగా వర్మి కంపోస్టును ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:56 AM