Accidental Gun Misfire: భీమిలిలో విషాదం.. గన్ మిస్‌ఫైర్ అయి సెక్యూరిటీ గార్డు మృతి..
ABN , Publish Date - Oct 04 , 2025 | 09:22 PM
బాజీ షేక్ వైజాగ్‌లోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయి చనిపోయాడు.
విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్‌ఫైర్ అయిన ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు మృత్యువాతపడ్డాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాజీ షేక్ వైజాగ్‌లోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాజీ షేక్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. గన్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ గన్ మిస్‌ఫైర్ ఘటన విశాఖలో సంచలనం రేపుతోంది. కాగా, గన్ మిస్‌ఫైర్ ఘటనల్లో కానిస్టేబుళ్లు తరచుగా ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది నవంబర్ నెలలో గుంటూరుకు చెందిన శ్రీనివాస్ అనే ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయాడు. 2023, ఆగస్టు నెలలో పాతబస్తీకి చెందిన భూపతి శ్రీకాంత్ అనే హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి చనిపోయాడు.
ఇవి కూడా చదవండి
యువకుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష