Married Woman Takes life: యువకుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Oct 04 , 2025 | 08:37 PM
కొమరవోలు గ్రామానికి చెందిన మెరుగుమాల పవన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వసంత అనే వివాహితను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.
యువకుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొమరవోలు గ్రామానికి చెందిన మెరుగుమాల పవన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వసంత అనే వివాహితను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.
రోజు రోజుకు అతడి వేధింపులు పెరుగుతూ పోయాయి. అతడి వేధింపులు భరించలేకపోయిన వసంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కలుపు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వసంత కలుపు మందు తాగిందని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే వసంత చనిపోయింది. పవన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష
అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి