మండిన కోస్తా
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:29 AM
బుధవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41, నరసాపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): కోస్తాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు ప్రవేశించిన తరువాత రెండు, మూడు రోజులు చల్లగా ఉన్న వాతావరణం గడచిన నాలుగు రోజుల నుంచి మళ్లీ వేడెక్కింది. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41, నరసాపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ అనిశ్చితి కారణంగా సాయంత్రం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎండ తీవ్రత, ఉక్కపోత, రాయలసీమలో ఎండ ప్రభావం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో గురువారం 40-41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News