Share News

Sathya Sai Jayanthi: రాష్ట్ర పండుగగా సత్యసాయి శత జయంతి

ABN , Publish Date - May 07 , 2025 | 07:12 AM

భగవాన్‌ సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి సిఫార్సుపై ప్రభుత్వం ఆమోదం తెలిపింది

Sathya Sai Jayanthi: రాష్ట్ర పండుగగా సత్యసాయి శత జయంతి

పుట్టపర్తి టౌన్‌, అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): భగవాన్‌ సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి శత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.

Updated Date - May 07 , 2025 | 07:12 AM