Share News

AP Eyes the Skies: సీఎం చంద్రబాబుతో సతీశ్‌రెడ్డి, సోమనాథ్‌ భేటీ

ABN , Publish Date - May 08 , 2025 | 05:08 AM

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందుండేలా డిఫెన్స్‌-ఏరోస్పేస్‌ పాలసీ రూపొందించాలన్న సూచనలను సతీశ్‌రెడ్డి, సోమనాథ్‌లు సీఎం చంద్రబాబుకు వెల్లడించారు. ఈ రంగాల్లో కేంద్ర అనుమతులు వచ్చేలా చురుకుగా పనిచేయాలని సీఎం చెప్పారు

AP Eyes the Skies: సీఎం చంద్రబాబుతో సతీశ్‌రెడ్డి, సోమనాథ్‌ భేటీ

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దేలా డిఫెన్స్‌-ఏరోస్పేస్‌ పాలసీని రూపొందిచాలని ప్రస్తుత రాష్ట్ర డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ హబ్‌ సలహాదారులు, డీఆర్డీవో మాజీ చైర్మన్‌ జి సతీశ్‌రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు.. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పేస్‌-డిఫెన్స్‌ పాలసీల రూపకల్పనతోపాటు ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా చురుకైన పాత్ర పోషించాలని సీఎం సూచించారు. అనంతరం సీఎం చంద్రబాబు వారిద్దరినీ సత్కరించారు.

Updated Date - May 08 , 2025 | 05:08 AM