Sajjala Bail Postponed: సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా
ABN , Publish Date - May 01 , 2025 | 04:10 AM
సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మద్యం కుంభకోణంలో అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖర్, చాణక్యల కస్టడీ పిటిషన్‌పై కూడా గురువారానికి వాయిదా వచ్చింది
కసిరెడ్డి, చాణక్యల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
గుణదల, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆరో నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బుధవారం ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయాధికారి భాస్కరరావు ఏసీబీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఇదిలావుంటే, మద్యం కుంభకోణంలో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై విచారణను, చాణక్య కస్టడీ పిటిషన్‌పై విచారణను కూడా గురువారానికి వాయిదా వేసింది.
పీఎస్‌ఆర్ బెయిల్‌పై నేడు విచారణ
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని మూడో అదనపు జ్యుడీషియర్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం న్యాయాధికారి విచారణను వాయిదా వేశారు.