Share News

Andhra Pradesh politics: మేమంతా జైలుకే

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:21 AM

వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలన్న ప్రయత్నం జరుగుతోందని సజ్జల ఆరోపించారు. కాకాణిని కలిసిన అనంతరం, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తారుమారైందని, ఇది భవిష్యత్‌కు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

Andhra Pradesh politics: మేమంతా జైలుకే

నెలో రెండు నెలలో అంతే ఎప్పుడైనా జైలుకెళ్లొచ్చు

రెడ్‌ బుక్‌’ను లైట్‌ తీసుకున్నాం

వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు

జైలులో కాకాణితో ములాఖత్‌

నెల్లూరు(క్రైం), మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘మా అందరిపైనా కేసులున్నాయి. మహా అయితే.. నెలో, రెండు నెలలో ఎప్పుడైనా జైలుకు పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏమీ లేదు.’’ అని వైసీపీ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు సెంట్రల్‌జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో శనివారం సజ్జల ములాఖత్‌ అయ్యారు. అనంతరం జైలు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు మేం అధికారంలోకి వస్తే రెడ్‌బుక్‌ పాలన ఉంటుందని చెప్పారు. అప్పుడు లైట్‌ తీసుకున్నాం. దాని పర్యవసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నాం.’’ అని అన్నారు. కల్పిత కథలు సృష్టించి వైసీపీ నాయకుల పాత్రలు చేర్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాతో మొదలై ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుందన్నారు. కాకాణి గట్టిగా మాట్లాడుతున్నప్పుడే ఆయనపై గురిపెడతారని ఊహించామని, అనుకున్నట్టుగానే జరిగిందన్నారు. వైసీపీని బలహీనం చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పిన ఆయన.. అది అసాధ్యమని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పితే ఎలా ఉంటుందో బిహార్‌ వంటి రాష్ట్రాలు, ఆటవిక రాజ్యాలు, ఎమర్జెన్సీ సమయాల్లో చూశామని ఇప్పుడు మళ్లీ ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాటిన విత్తనం.. రేపు దాని ఫలాలు.. ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదని, అవి భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం, నెల్లూరు నగరంలోని కాకాణి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 08:37 AM