Tirumala: దేవదేవులకు పవిత్రాల సమర్పణ
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:56 AM
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ జరిగింది.
తిరుమల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ జరిగింది. శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వార్‌కు, వరదరాజ స్వామికి, వకుళమాతకు, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనుల వారికి, యోగనరసింహస్వామికి, భాష్యకార్లకు, భూవరాహ స్వామికి, బేడి ఆంజనేయస్వామికి పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని మాడవీధుల్లో ఊరేగించారు.