Share News

RTI Forum: ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - May 15 , 2025 | 03:27 AM

ఆర్టీఐ ఫోరం రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, చీఫ్‌ కమిషనర్‌ బాషా నిరంకుశంగా వ్యవహరించడం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అధికారులు తమ వినతిని స్వీకరించలేదని ఫోరం ప్రతినిధులు తెలిపారు.

RTI Forum: ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి

మౌలిక వసతుల నిలిపివేతపై ఫోరం ఫర్‌ ఆర్టీఐ ఫిర్యాదు

మంత్రి సత్యకుమార్‌, మాజీ మంత్రి సోమిరెడ్డికి వినతిపత్రం

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో రెండేళ్లు గా మౌలిక సదుపాయాలు నిలిపివేసి, తన ను ఎవరూ కలవరాదని నిరంకుశంగా వ్యవహరిస్తున్న చీఫ్‌ కమిషనర్‌ బాషాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్టీఐ ఫోరం బుధవా రం సచివాలయంలోని జీఏడీ కార్యదర్శికి ఫిర్యా దు చేసింది. మంత్రి సత్యకుమార్‌, మాజీ మం త్రి సోమిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిం ది. ఆర్టీఐ ఫోరం జాతీయ అధ్యక్షుడు ప్రత్తిపాటి చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుం చి వచ్చిన ఆర్టీఐ కార్యకర్తలు తొలుత మంగళగిరిలోని కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు, ఇతర సిబ్బందికి తాగునీరు, కుర్చీలు, వెయిటింగ్‌ హాల్‌ వంటివి కల్పించాలని చీఫ్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన తమ అర్జీని స్వీకరించలేదని, సిబ్బంది కూడా నిరాకరించారని ఫోరం ఫర్‌ ఆర్టీఐ ప్రతినిధులు తెలిపారు. కమిషనర్‌ కార్యాలయంలో అవకతవకలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:27 AM