RTC Employees: 22న కలెక్టరేట్ల వద్ద ఆర్టీసీ ఎన్‌ఎంయూఏ ఆందోళనలు
ABN , Publish Date - May 15 , 2025 | 03:50 AM
ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేసి వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఎన్‌ఎంయుఏ నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది.
విజయవాడ (బస్‌స్టేషన్), మే 14(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేసి వినతి పత్రాలు సమర్పించనున్నట్టు ప్రజా రవాణ సంస్థ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయుఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌ఎంయుఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఎన్‌ఎంయుఏ సెంట్రల్ కమిటీ ఆమోదించిన తీర్మానం మేరకు ఈ నెల 22వ తేదీన ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకువస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి లేఖ అందజేశారు. కాగా.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయుఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు చలో డీపీటీఓ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బుధవారం ధర్నాలు నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, దీంతోపాటు తాము సమ్మెకు వెళ్లేందుకు కూడా సిద్ధమని రమణారెడ్డితెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News