191 Roads Upgrade: రూ.400 కోట్లతో 191 రహదారుల నిర్మాణం
ABN , Publish Date - May 04 , 2025 | 05:54 AM
గ్రామీణ, మండల రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు నాబార్డు నుంచి మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 191 రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది
అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని గ్రామీణ, మండల రహదారుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి రూ.400 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరమ్మతులకు ఏమాత్రం అనువుగా లేని గ్రామీణ ప్రాంతాల్లోని 191 రహదారులను పునర్నించనున్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌కు అనుమతి ఇస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు రహదారుల నిర్మాణం కోరుతూ ప్రభుత్వానికి విన్నపాలు చేసిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అత్యంత ముఖ్యమైన 191 రోడ్లను ఎంపిక చేశారు. ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పుడు పరిపాలనామోదం కూడా లభించడంతో త్వరలో టెండర్లు పిలవనున్నారు.