Rain Alert: బీ అలర్ట్.. రాష్ట్రంలో వర్షాలే.. వర్షాలు
ABN , Publish Date - May 15 , 2025 | 06:32 PM
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విశాఖ: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అల్లూరి జిల్లా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలో రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం వుందని హెచ్చరించారు. రాబోయే రెండు రోజులూ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవని, రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందన్నారు. ఏలూరు 55 మిల్లీమీటర్లు, పార్వతీపురం లో 52 మిల్లీలీటర్లు వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. నైరుతి రుతు పవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.