Share News

IMA National Award: ప్రొఫెసర్‌ రామ్మోహన్‌కు ఐఎంఏ జాతీయ అవార్డు

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:25 AM

ఎయిమ్స్‌ (మంగళగిరి) హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి, జాయింట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేసు రామ్మోహన్‌ ఐఎంఏ జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక ‘ఎమినెంట్‌ డాక్టర్స్‌ పర్సనాలిటీ అవార్డు’కు ఎంపికయ్యారు.

IMA National Award: ప్రొఫెసర్‌ రామ్మోహన్‌కు ఐఎంఏ జాతీయ అవార్డు

గుంటూరు మెడికల్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఎయిమ్స్‌ (మంగళగిరి) హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి, జాయింట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేసు రామ్మోహన్‌ ఐఎంఏ జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక ‘ఎమినెంట్‌ డాక్టర్స్‌ పర్సనాలిటీ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ సర్బరీ దత్‌ వెల్లడించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్‌ బీసీ రాయ్‌ సంస్మరణార్థం ఐఎంఏ.. ఏటా జూలై 1న ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ప్రకాశం జిల్లాలోని పమిడిపాడుకు చెందిన డాక్టర్‌ రామ్మోహన్‌ ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్‌లో జాయింట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 02:33 AM