Share News

Fee Reimbursement: ఫీజు బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - May 23 , 2025 | 05:46 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది. పూర్వ కాలానికి సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల ప్రైవేట్‌ కళాశాలలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని తెలిపింది.

Fee Reimbursement: ఫీజు బకాయిలు విడుదల చేయాలి

ప్రభుత్వానికి ఏపీపీఈసీఎంఏ విజ్ఞప్తి

అమరావతి, గుంటూరు కార్పొరేషన్‌, మే 22( ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సకాలంలో విడుదల చేయాలని, రాబోయే విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ అడ్మిషన్స్‌ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏపీపీఈసీఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్‌ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అపెక్మా అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరంతో పాటు 2023-24 విద్యా సంవత్సరం, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2023-24కు సంబంధించి మూడు వాయిదాలు, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాలతో పాటు అంతకు ముందు నుంచి వున్న పీజీ కోర్సుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చాలా వరకు పేరుకుపోయాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులను ఖరారు చేసి అడ్మిషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:46 AM