వైౖభవంగా యోగయ్యస్వామి తిరునాళ్ల
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:11 AM
మండలంలోని సోమేపల్లి, ఎండూరివారిపాలెం గ్రామాల్లో యోగయ్యస్వామి తిరునాళ్లను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

త్రిపురాంతకం, జనవరి 16 ( ఆంధ్రజ్యోతి ) : మండలంలోని సోమేపల్లి, ఎండూరివారిపాలెం గ్రామాల్లో యోగయ్యస్వామి తిరునాళ్లను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్బంగా గ్రామస్థులతోపాటు దూరప్రాంతాల భక్తులు యోగయ్య స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు భోజన ఏర్పాట్లతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిం చారు. ఎండూరివారిపాలెంలో రెండు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.