Share News

నగర పంచాయతీ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:01 AM

పొదిలి నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు.

నగర పంచాయతీ అభివృద్ధికి కృషి

పొదిలి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పొదిలి నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో చెత్తసేకరణ ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు. నగర పంచాయితీ వార్డులలో చెత్తసేకరణకు ఇటీవల మంజూ రైన నూతన ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్‌ నడిపి సిబ్బందిని ఉత్సాహపరిచాడు. అనంతరం దర్శి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కాటూరివారి పాలెం గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో 5ఎంవీఏ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో కాటూరివారిపాలెం, బుచ్చన్నపాలెం, కొత్తపా లెం, అన్నవరం, పొదిలి పట్టణంలోని రైతు లకు గృహ వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాలో తారతమ్యాలు లేకుండా స్థిర పరిచేందుకు సబ్‌స్టేషన్‌ ఉపయోగ పడుతుం దన్నారు. త్వరలో మండలంలోని ఏలూరు లో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మిస్తామ న్నారు. తద్వారా విద్యుత్‌ సరఫరాకు ఎటు వంటి అంతరాయం ఉండదన్నారు. కార్య క్రమంలో విద్యుత్‌శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యసేవలు

మార్కాపురం : పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యం ద్వారా మెరుగైన సేవలందిచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలో 17 మందికి మంజూరైన రూ.18.06 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధి దారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్‌కార్డు ఉండి కార్పొరేట్‌ వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సకాలంలో ఆర్థిక సాయం అందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయనిధి చెక్కులను సాధ్యమైనంత వేగంగా లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా బావించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, నారు వెంకటేశ్వరరెడ్డి, జంకె రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 01:01 AM