Share News

కోతుల భయంతో జారిపడిన మహిళ.. తీవ్రగాయాలు

ABN , Publish Date - Feb 10 , 2025 | 10:40 PM

కోతులు దాడిచేయడంతో మహిళకు తీవ్రగాయాలయిన ఘటనమండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

కోతుల భయంతో జారిపడిన మహిళ.. తీవ్రగాయాలు

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి) : కోతులు దాడిచేయడంతో మహిళకు తీవ్రగాయాలయిన ఘటనమండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన మారమ్మకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన కధనం ప్రకారం... కోసిగి గ్రామం నుంచి మిరప కోతలకు కొందరు కూలీలు తిమ్మాపురం వచ్చారు. వారు బస చేసిన ఇంటి బయట అరుగుపై పడుకుని ఉండగా కోతుల గుంపు దాడి చేశాయి. దీంతో మారమ్మ అరుగుపై నుండి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన బంధువులు ఆమెను వెంటనే దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు.

Updated Date - Feb 10 , 2025 | 10:40 PM