Share News

న్యాయం జరిగేనా?

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:37 AM

నకిలి పత్రాలు సృష్టించి తమఆస్తిని ఇతరులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా రని అరోపిస్తు మూడురోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్న వృద్ధులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.

న్యాయం జరిగేనా?

ఎర్రగొండపాలెంరూరల్‌, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి) : నకిలి పత్రాలు సృష్టించి తమఆస్తిని ఇతరులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా రని అరోపిస్తు మూడురోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్న వృద్ధులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక బాలికల వసతి గృహాం ఎదురుగా సర్వే నెంబరు 58-1లో 5కుంటల స్థలం, గృహాన్ని మండలం లోని సర్వాయి పాలెంకు చెందిన దొద్దపనేని శ్రీనివాసులు ఆయన భార్య యోగమ్మకు రిజిష్టర్‌ చేశారు. ఆ రిజిస్ట్రేషన్‌ అక్రమమని బాధితుడు తిరుమలరావు ఆరోపించాడు. ఈ విషయంపై మూడు రోజు లుగా తహసీల్దార్‌ కార్యాల యానికి, పోలీసు స్టేషన్‌కు తిరుగుతున్నారు. గురు వారం కూడ స్థానిక సిఐ సిహెచ్‌ ప్రభాకరరావు పిలవడంతో వృద్ధులైన ఆయన, ఆయన భార్య వెళ్లారు. తమ వద్ద ఉన్న రికార్డులను సీఐకి అందజేసినట్లు వారు తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ నకిలిపత్రాలు పెట్టి రిజిస్ర్టేషన్‌ చేశా రంటూ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయటం లేదని అవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధి కారులైన జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే వారు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లగా, వారికి సమాదానం చేప్పే వారే కరువయ్యారని అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:37 AM