సీఎం, డిప్యూటీ సీఎంపై మాట్లాడే అర్హత ఎక్కడిది?
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:10 AM
ఎన్‌డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నా యుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మా ట్లాడే అర్హత ఎక్కడ ఉందని జనసేన పార్టీ జి ల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ప్రశ్నించారు.

బూచేపల్లిపై జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ధ్వజం
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యో తి): ఎన్‌డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నా యుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మా ట్లాడే అర్హత ఎక్కడ ఉందని జనసేన పార్టీ జి ల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ప్రశ్నించారు. ఆది వారం సాయంత్రం ఒంగోలులోని రవిప్రియా మాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డికి పరి పాలన చేతకాక ఇష్టానురీతిగా వ్యవహరించడం తో ప్రజలు చీత్కరించి ఇంటికి పంపారనే విష యాన్ని శివప్రసాద్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి కేంద్రాన్ని నిధులు అడిగేందుకు, ప్రాజెక్టుల కేటాయింపులు అడిగేం దుకు భయపడిన వ్యక్తులు వైసీపీ నేతలన్నారు. జగన్మోహన్‌రెడ్డి రూ.3వేల పింఛను చేసేందుకు ఐదేళ్ళు పట్టిందని, ఎన్‌డీఏ కూటమి చెప్పినట్లు గా ఏడు నెలల్లో అనేక పథకాలను అమలు చే సిందని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను కూటమి చేసిన పవ న్‌కళ్యాణ్ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలు సునని తెలిపారు. ప్రజల డబ్బులతో వేతనాలు తీసుకుంటున్న శివప్రసాద్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు చర్చించాలని, లేకపోతే తన పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నాయకుడు కంది రవి శంకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న వ్యక్తు లు రాజకీయ విమర్శలు చేయాలే తప్ప వ్యకి ్తగత విమర్శలు చేసేటప్పుడు స్థాయిని మర్చి మాట్లాడటం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ఎన్ డీఏ అధికారంలో ఉందంటే దానికి కారణం పవ న్‌కళ్యాణ్ అని దేశ ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిట్టెం ప్ర సాద్, కాసాని వాసు, తిరుమలశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.