జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడిగా మాగుంట
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:12 AM
జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జడ్‌ఆర్‌యూసీసీ) సభ్యుడిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (జడ్‌ఆర్‌యూసీసీ) సభ్యుడిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మాగుంట కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల శాఖ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాగా జడ్‌ఆర్‌యూసీసీ మెంబర్‌గా నియమితులయ్యారు. మాగుంటను పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు అభినందించారు.