Share News

ఉర్దూ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:49 AM

స్థానిక చెరువుకట్ట సమీపంలోని ఉర్దూ ప్రాథ మిక పాఠశాలను యథావిధిగా కొనసాగించా లని స్థానిక గొర్లగడ్డకు చెందిన ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కోరారు.

ఉర్దూ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలి

మార్కాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక చెరువుకట్ట సమీపంలోని ఉర్దూ ప్రాథ మిక పాఠశాలను యథావిధిగా కొనసాగించా లని స్థానిక గొర్లగడ్డకు చెందిన ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కోరారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయం లో ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. ఉర్ధూ ప్రాథమిక పాఠశాలను 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఉర్దూ మాఽధ్యమంలో విద్యా ర్థులకు బోధన చేస్తున్నట్లు తెలిపారు. కానీ జీవో నంబరు 117 రద్ధుతో పాఠశాల పునః నిర్మాణంలో భాగంగా ఉర్దూ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను కిలోమీటర్ల దూరంలోని తెలుగు, ఇంగ్లీష్‌ మా ధ్యమ పాఠశాలలకు తరలిస్తార న్నారు. దీంతో ముస్లిం మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ తారన్నారు. మార్కాపురంలో ఉన్న ఏకైక ఉర్దూ పాఠశాల కావడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్‌ దొడ్డా భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్‌ బషీరున్సీసాబేగం, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ సాధిక్‌, టీడీపీ మైనార్టీ నాయకులు మొఘల్‌ షాకీర్‌హుసేన్‌బేగ్‌, గఫార్‌ఖాన్‌, ఖలీలుల్లా ఖాన్‌, ఆయూబ్‌ఖాన్‌, ఎంహెచ్‌పీఎస్‌ పట్టణ అధ్యక్షులు మొఘల్‌ జాబీర్‌హుసేన్‌బేగ్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:49 AM