ఉత్సవాలతో గ్రామాల్లో ఐక్యత
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:39 PM
గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలు గ్రామస్థుల మధ్య ఐక్యతను చాటాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. ప్రతిఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మంగారి తిరునాళ్ల మండలంలోని తాళ్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలు గ్రామస్థుల మధ్య ఐక్యతను చాటాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. ప్రతిఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మంగారి తిరునాళ్ల మండలంలోని తాళ్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు. అందులోభాగంగా బుధవారం రాత్రి ఎమ్మెల్యే డా క్టర్ ఉగ్రనరసింహారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాల్లో ఉత్సవాలు పేరుతో నిర్వహించే కార్యక్రమాలతో ప్రజల మధ్య సమానత్వంతో పాటు ఐక్యతను పెంచుతా యన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలు ఓబులురెడ్డి, నంబలు వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అలాగే, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణయాదవ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మూలె మాలకొండారెడ్డి, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.