Share News

వైసీపీ హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలు

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:50 AM

వైసీపీ హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మం త్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు.

వైసీపీ హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలు

మంత్రి స్వామి

ఒంగోలు కార్పొరేషన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యో తి): వైసీపీ హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ మం త్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. క్రెడాయి ఆధ్వర్యంలో స్థానిక ఏ1 కన్వెన్షన్‌ హాలులో మూడు రోజులపాటు ఏర్పా టు చేసిన ప్రాపర్టీ రియాలిటీ షోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ విధ్వంకర పాలనతో రా ష్ట్రంలో నిర్మాణ రంగం అస్తవ్యస్తంగా మారింద న్నారు. కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చి రూ.2లక్షల కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాప న చేశారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జరిగే నిరంతర ప్రక్రియకు క్రెడాయ్‌ కలిసి రావాలని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రాపర్టీ రి యాలిటీ షోను సందర్శించి నిర్వాహకులను అ భినందించారు. ఒంగోలులో ఇలాంటి షో నిర్వ హించడం సంతోషంగా ఉందన్నారు.కార్యక్రమం లో క్రెడాయ్‌ ప్రతినిధులు, బిల్డర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:50 AM