శరవేగంతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణ పనులు
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:33 AM
దర్శి పట్టణంలోని తూ ర్పుగంగవరం రోడ్డులో టీటీడీ కల్యాణ మండపం నిర్మా ణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ మా గుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో నిర్మాణం పనులు ప్రా రంభమయ్యాయి.

దర్శి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలోని తూ ర్పుగంగవరం రోడ్డులో టీటీడీ కల్యాణ మండపం నిర్మా ణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ మా గుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో నిర్మాణం పనులు ప్రా రంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 డిసెంబర్‌లో టీటీడీ కల్యాణ మండపం నిర్మా ణానికి అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం దాతల సహకారంతో రూ.50 లక్షల డిపాజిట్లు కూడా చెల్లిం చారు. ఆతర్వాత కల్యాణ మండపం నిర్మాణం గురించి వైసీపీ పాలకులు పట్టించుకో లేదు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది ఎంపీ మా గుంట, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాత ఫైల్‌ను మళ్లీ కదిలించి నిధులు మంజూరు చేయించా రు. గత డిసెంబర్‌లో భూమిపూజ చేసి పనులు ప్రా రంభించారు. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నిర్మా ణ పనులు పూర్తయితే దర్శి ప్రజలకు శుభకార్యాలు ని ర్వహించుకునేందుకు అనువుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ కల్యాణ మండపాల్లో అద్దెలు విపరీతంగా ఉ న్నాయి. టీటీడీ కల్యాణ మండపం అందుబాటులోకి వ స్తే సామాన్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.