పర్యాటకులు పోలీసుల సూచనలు పాటించాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:07 AM
సముద్ర తీరానికి వచ్చిన పర్యాటకులు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ ఏఆ ర్.దామోదర్ సూచించారు.

ఎస్పీ దామోదర్
సింగరాయకొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : సముద్ర తీరానికి వచ్చిన పర్యాటకులు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ ఏఆ ర్.దామోదర్ సూచించారు. పాకల తీరంలో అలల ఉధృతికి ముగ్గురు మృ తి చెందారని, మరో యువకుడు గల్లంతయ్యాడని సమాచారం అందుకు న్న ఆయన హుటాహుటిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామితో కలిసి గురువారం సాయంత్రం పాకల తీరానికి వ చ్చారు. అక్కడ ఉన్న పోలీసులను ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలు సుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులతో మట్లాడారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానిక జాలర్లతో మాట్లాడి గల్లంతైన తమ్మిశెట్టి పవన్ కోసం బోట్లలో గాలింపు చర్యలు ముమ్మరం చే శారు. స్వయంగా కాసేపు పర్యవేక్షించారు. అనంతరం స్వామితో కలిసి కం దుకూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు. వా రి కుటుంబ సభ్యులను ఓదార్చారు.