Share News

ఆనందంగా గడుపుతూ.. అంతలోనే అనంత లోకాలకు..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:05 AM

వారంతా ఒకే కు టుంబానికి చెందిన వారు. సంక్రాంతి పండుగ ముగియడంతో ఆనందంగా గడపడానికి దాదాపు 25 మందికి పైగా కలిసి పాకల తీరానికి వచ్చారు. చి న్నాపెద్ద అంతా కలిసి సంతోషంగా కేరింతలు కోడుతూ సముద్ర స్నా నాలు ఆచరిస్తున్నారు.

 ఆనందంగా గడుపుతూ.. అంతలోనే అనంత లోకాలకు..

పాకల తీరంలో ముగ్గురు మృత్యువాత

సింగరాయకొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : వారంతా ఒకే కు టుంబానికి చెందిన వారు. సంక్రాంతి పండుగ ముగియడంతో ఆనందంగా గడపడానికి దాదాపు 25 మందికి పైగా కలిసి పాకల తీరానికి వచ్చారు. చి న్నాపెద్ద అంతా కలిసి సంతోషంగా కేరింతలు కోడుతూ సముద్ర స్నా నాలు ఆచరిస్తున్నారు. మధుర జ్ఞాపంగా ఉంచుకోవడానికి మధ్యలో కు టుంబసభ్యులు అందరూ కలిసి తీరాన గ్రూపు ఫొటో దిగారు. అనంతరం మరోమారు అందరూ కలిసి సముద్రంలో దిగగా అంతలోనే విధి చిన్న చూపు చూసింది. వారిలో నలుగురిని మృత్యు అలలు అమాంతం లాగేసు కున్నాయి. వారిలో ముగ్గురు మృతి చెందగా ఒకరిని మెరైన్‌ పోలీసులు, మత్స్యకారులు రక్షించారు. ఆనందంగా గడపడానికి వచ్చి కళ్లముందే తమ వాళ్లు ముగ్గురు అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల ర దనలు మిన్నంటుతున్నాయి.

స్నేహితులతో కలిసి వెళ్లి..

సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన తమ్మి శెట్టి పవన్‌ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో అమెజాన్‌లో డెలవరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఈ ఉద్యోగంలో కూడా నెల రోజులు క్రితమే చేరాడు. తొ లి నెల జీతం తీసుకొని సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లడానికి బస్సు టికెట్‌ కూడా రిజర్వ్‌ చేస్తుకున్నాడు. ఈ తరుణంలో గురువారం తన స్నేహితులు రవితేజ, రాజేష్‌తో కలిసి సర దగా గడపడానికి పాకల తీరానికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఉ ల్లాసంగా మునుగుతుండగా అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహం బయటకు రాకపోవడంతో మంత్రి స్వామి, ఎస్పీ దా మోదర్‌ ఆదేశాలతో స్థానిక పోలీసులు, మెరైన పోలీసులు, మత్స్యకారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పవన్‌ తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్‌ లో బేల్దారి పనులు చేసుకుంటూ కుమార్తెను, కుమారుడును అక్కడే చదివించారు. మూడేళ్ల కితం స్వగ్రామానికి వచ్చి బేల్దారి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో చేతికి అంది వచ్చిన కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:06 AM