మహనీయుల అడుగుల్లో యువతరం నడవాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 10:37 PM
ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుల అడుగుల్లో యువతరం నడవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం చీరాల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాలటౌన్, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి) : ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుల అడుగుల్లో యువతరం నడవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం చీరాల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి వేషధారణలతో అందరినీ అలరించారు. దీంతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే శివాజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.