Share News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:38 PM

పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ప్ర భుత్వ హైస్కూల్‌, జూనియర్‌ కళాశాల, బాలికల హాస్టల్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. ప్రాంగ ణం అంతా పిచ్చిమొక్కలతో, చెత్త కుప్పలతో నిండి ఉండటంతో ఎమ్మెల్యే దగ్గరుండి శుభ్రం చేయించి, బ్లీచింగ్‌ చల్లించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
కనిగిరిలోని బాలికల హాస్టల్‌ ప్రాంగణంలో జరిగిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ప్ర భుత్వ హైస్కూల్‌, జూనియర్‌ కళాశాల, బాలికల హాస్టల్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. ప్రాంగ ణం అంతా పిచ్చిమొక్కలతో, చెత్త కుప్పలతో నిండి ఉండటంతో ఎమ్మెల్యే దగ్గరుండి శుభ్రం చేయించి, బ్లీచింగ్‌ చల్లించారు. రాళ్ళను వేరించి కుప్పలుగా పోయించారు. ప్రాంగణంలోని చెత్తకుప్పలను కా ల్పించి బూడిద, చెత్త, రాళ్ళను మున్సిపల్‌ వాహ నంలో తరిలించారు. బాలికల హాస్టల్‌ గదుల వెం బడే ఉన్న చిల్లచెట్లను దగ్గరుండి తీయించారు. దీంతో ప్రాంగణం అంతా శుభ్రంగా మారింది.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు ద రిచేరవన్నారు. పిచ్చి మొక్కలను పరిసరాల్లో లేకుండా చూడాలన్నారు. పిచ్చి మొక్కల నుంచి వచ్చే గాలి ఆరో గ్యకరమైనది కాదన్నారు. క్యాన్సర్‌ కారకాలుగా ఆయా పిచ్చి మొక్కలు ఉంటాయని తెలిపారు. పిచ్చి మొక్కల ను నరికి వాటిని పొయ్యిల్లో వాడుకుని వంట వండు కో వటం కూడా అనారోగ్యాలకు దారి తీస్తాయన్నారు. చా లామంది పేద కుటుంబాల వారు ఇలాంటి విధానాన్ని అవలంబిస్తుంటారన్నారు. ఇంటి పరిసరాల్లో వాడి పడే సిన వస్తువులను ఉంచుకోరాదన్నారు. నిల్వ నీరు లేకుం డా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమి షనర్‌ జోసఫ్‌ దానియేలు, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, ఎంపీపీ ప్రకాశం, టీడీపీ నేతలు సానికొమ్ము తిరుపతి రెడ్డి (ఎస్‌టీఆర్‌), ఐవీ నారాయణ, నజిముద్దీన్‌, తిరుపా లు, చిలకపాటి లక్ష్మయ్య, కరణం అరుణ, మాజీ కౌన్సిల ర్‌ షేక్‌ వాజిదాబేగం, తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతకు పాధ్యానం

దర్శి : పరిసరాల పరిశుభ్ర తకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రా ష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా అభివృద్ధి చేసేందుకు అంద రూ భాగస్వాములు కావాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఆరోగ్యం, పరిశుభ్ర తకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషిచేస్తున్నట్టు డా క్టర్‌ లక్ష్మి చెప్పారు. త్వరలో అన్నా క్యాంటిన్‌, ఆడిటో రియం, డ్రైవింగ్‌ శిక్షణా పరిశోధన స్ధానం, కోల్డ్‌స్టోరేజీ నిర్మాణ పనులు పునఃప్రారంభమవు తాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో ప్రారంభించిన వీటి నిర్మాణాలను వైసీపీ పాలకుల అసమర్థతతో ఐదేళ్లు పునాదులతోనే నిలచిపోయాయన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయి న ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌, సంబం దిత మంత్రులకు వివరించి నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌, నా రపుశెట్టి పిచ్చయ్య, డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, తహసీల్దా ర్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌, సీఐ వై.రామారావు, కమిషనర్‌ వై.మహేశ్వరరావు, ఎంపీడీవో ఎల్‌.కృష్ణమూర్తి, ఎంఈవో కె.రఘురామయ్య,, ఈవోఆర్డీ ఆవుల సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:38 PM