దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:29 AM
దివ్యాం గులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో ఎ లాంటి నిర్లక్ష్యం వహించవద్దని, సత్వరమే స్పందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు నగరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): దివ్యాం గులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో ఎ లాంటి నిర్లక్ష్యం వహించవద్దని, సత్వరమే స్పందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీ వెన్స్ కార్యక్రమంలో ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడా రు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించాలని ఆమె కోరారు. గ్రీవెన్స్‌లో 60 మంది దివ్యాం గులు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారని చెప్పా రు. అందువల్ల వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వారికి ప్రభు త్వపరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు అందజేయాలని క లెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గో పాలకృష్ణ, విభిన్నప్రతిభావంతులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.