Share News

రైల్వేలైన్‌ పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:26 PM

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులను ఆశాఖ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. సికింద్రాబాద్‌కు చెందిన రైల్వే భద్రతాశాఖ కమిషనర్‌ మాధవి, చీఫ్‌ అడ్మినిస్టేటివ్‌ అధికారి సత్యప్రకాష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ డీఏ సుబ్రమణ్యం, గుంటూరుకు చెందిన డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ దుర్గాప్రసాద్‌ దర్శి-పొదిలి ప్రాంతాల్లో రైల్వేలైన్‌ నిర్మాణాలను పరిశీలించారు.

రైల్వేలైన్‌ పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు
రైల్వే లైన్‌ పనులను పరిశీలిస్తున్న రైల్వేశాఖ ఉన్నతాధికారులు

దర్శి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులను ఆశాఖ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. సికింద్రాబాద్‌కు చెందిన రైల్వే భద్రతాశాఖ కమిషనర్‌ మాధవి, చీఫ్‌ అడ్మినిస్టేటివ్‌ అధికారి సత్యప్రకాష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ డీఏ సుబ్రమణ్యం, గుంటూరుకు చెందిన డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ దుర్గాప్రసాద్‌ దర్శి-పొదిలి ప్రాంతాల్లో రైల్వేలైన్‌ నిర్మాణాలను పరిశీలించారు. గతంలో దర్శి వరకు గూడ్స్‌ రైల్‌ వాహనాల ట్రయిల్‌ రన్‌ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా దర్శి నుంచి పొదిలి వరకు నిర్మించిన రైల్వేలైన్‌ను పరిశీలించారు. దర్శి నుంచి మల్లవరం వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించారు. మల్లంవరం వరకు రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మల్లవరం-పొదిలి మధ్యలో ఒక రైతు కోర్టుకు వెళ్లటంతో సుమారు 200 మీటర్ల రైల్వేలైన్‌ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సమస్య పరిష్కరిస్తే పొదిలి వరకు రైళ్లు నడిపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 11:26 PM