సత్తా చాటిన నంద్యాల ఎడ్లు
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:43 PM
సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో నంద్యాల ఎడ్లు సత్తా చాటాయి. ఈపోటీలను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుంపమాన్‌దిన్నె గ్రామానికి చెందిన కుందురు రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఎడ్లజత 2101 అడుగుల దూరం లాగగా, ప్రథమ బహుమతి కింద ఎడ్ల యజమాని రూ.1,01,116 అందుకున్నారు.

సీఎస్‌పురం(పామూరు), ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో నంద్యాల ఎడ్లు సత్తా చాటాయి. ఈపోటీలను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుంపమాన్‌దిన్నె గ్రామానికి చెందిన కుందురు రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఎడ్లజత 2101 అడుగుల దూరం లాగగా, ప్రథమ బహుమతి కింద ఎడ్ల యజమాని రూ.1,01,116 అందుకున్నారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్‌కు చెందిన ఎడ్లజత 1956 అడుగులు లాగగా ద్వితీయ బహుమతి కింద రూ.70,116లు, కుందురు రాంభూపాల్‌కు చెందిన రెండవ ఎడ్లజత 1950 అడుగులు లాగి తృతీయ బహుమతి కింద రూ.50,116 ఎడ్ల యజమానులు అందుకున్నారు. వరుసగా ఏడు స్థానాల్లో వచ్చిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, ముత్యాల వెంకటసుబ్బారెడ్డి, ఎస్‌సీ మాలకొండయ్య, పాలగుల్ల మోహన్‌రెడ్డి, ఎస్.రమణయ్య, ఎస్.తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.