సరైన పక్వానికి వచ్చినప్పుడే ఆకు రేల్చాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:41 AM
పొగాకు సరైన పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే ఆకును కొట్టాలని పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్ అన్నారు.

పొదిలి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : పొగాకు సరైన పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే ఆకును కొట్టాలని పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్ అన్నారు. మంగళ వారం మండలంలోని కంభాలపాడు, పోత వరం గ్రామాల్లో పొగాకు తోటలను, బ్యారన్ లను, పొగాకు అల్లుతున్న కూలీలకు పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ పొగాకు క్యూరింగ్ చేసే సమ యంలో, అల్లకం సమయంలో తగిన జాగ్రత్త లు పాటించాలన్నారు. కాల్పు సమయంలో పరిమితికి మించి బ్యారన్‌లో కర్ర లోడ్ చేయకూడదన్నారు. క్యూరింగ్ సమయంలో అగ్నిప్రమాదాలు జరగకుండా మొద్దుగొట్టం మీద జాలీని ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. క్యూరోమీటర్లను వినియోగించాలన్నారు. త్వరలో పొగాకువేలం ప్రారంభం అవుతుందని గ్రేడ్ చేసి మండెలు ఏర్పాటు చేసే సమయం లో నాణ్యమైన పొగాకులో అన్యపదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దానివలన నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయన్నారు. అనంతరం పొగాకు బోర్డులో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. బోర్డు ఆవరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీసీ, బీటీ రోడ్లపనులు బోర్డు ఆవరణలో జరుగుతున్నాయన్నారు. త్వరలో వేలం ప్రారం భం అవుతుందని అప్పటికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. కార్యక్రమంలో దక్షిణప్రాంత తేలికనేలల ప్రాంతీయ అధికారి ఎం లక్ష్మణరావు, పొదిలి వేలం నిర్వహానాధికారి గిరిరాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.