పాలకుల వైఫల్యంతోనే జిల్లా వెనుకబాటు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:19 PM
పాలకులు వైఫల్యంతోనే ప్రకాశం జిల్లా వెనుకబడిపోయి వలసలు, కరువులో ముందుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.రెండు వేల కోట్లు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

- వలసలు, కరువును నివారించాలంటే వెలుగొండ పూర్తి చేయాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య
కనిగిరి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పాలకులు వైఫల్యంతోనే ప్రకాశం జిల్లా వెనుకబడిపోయి వలసలు, కరువులో ముందుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.రెండు వేల కోట్లు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భగా సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యుడు యాసిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఈశ్వరయ్య మట్లాడారు. 1996లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. నాలుగుసార్లు ఆయన సీఎం హోదాలో ఉండి ప్రాజెక్టును పూర్తిచేయలేక పోయారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిని జగన్‌మోహన్‌రెడ్డి కూడా పూర్తి చేయలేక పోయారన్నారు. కనిగిరి ప్రాంతంలో వలసలు ఆగిపోవాలంటే బీళ్ళు భూములన్నీ సాగులోకి రావాలన్నారు. అందుకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయటంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సీపీఐ జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడు వై.రవీంద్రబాబు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు వెంటనే నిధులు కేటాయించాలన్నారు. దాంతో పాలేటిపల్లి, మోపాడు, పునుగోడు, గొల్లపల్లి రిజర్వాయర్‌లకు నీరు అందుతుందన్నారు. తద్వార ఈ ప్రాంతంలో భూములన్నీ సాగులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌వెంకట్రావు, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డికి అందజేశారు.