Share News

టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:16 PM

నియోజకవర్గంలో టీడీపీ దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రజాదరణతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో 31, 32 వార్డులతో పాటు మండల పరిధిలోని తోటవారి పా లెం దండయ్య కాలనీకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.

టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో టీడీపీ దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రజాదరణతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో 31, 32 వార్డులతో పాటు మండల పరిధిలోని తోటవారి పా లెం దండయ్య కాలనీకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. నియోజకవర్గంలో ప్రతి ప్రాంతానికీ సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామని చెప్పారు. పార్టీలో చేరికలతో నూతన ఉత్సాహం కలు గుతుందని చెప్పారు. స్వేచ్ఛ వాతావరణాన్ని ప్రజలకు అందించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:16 PM