Share News

పనులను వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 10:46 PM

వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నూతన వసతి గృహాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.

పనులను వేగంగా పూర్తి చేయాలి
జాబితాను ఎమ్మెల్యేకు అందచేస్తున్న ఎంఈవోలు

నియోజకవర్గంలో హాస్టళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నూతన వసతి గృహాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మండలంలోని కంచర్లవారిపల్లి హైస్కూల్‌లో నూతనంగా నిరిస్తున్న హాస్టల్‌ భవన నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల పురోగతిని తెలియచేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, కిశోర్‌, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు.

ప్రతి పాఠశాల ఆదర్శంగా ఉండాలి

నియోజకవర్గంలోని ప్రతి పాఠశాల రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా తయారు కావాలని ఎమ్మెల్యే సూచించారు. బుధవారం ఉగ్ర నివాసంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంఈవోలు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటినీ ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని ఎమ్మెల్యేకు చెప్పారు. ఇప్పటికే కనిగిరిలో 5, పామూరు 3, వెలిగండ్లలో 1 ప్రాఽథమికోన్నత పాఠశాలలను హైస్కూల్‌గా మార్చేలా తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఎంఈవోలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నియోజకవర్గ మానిటరింగ్‌ అధికారి దేవిరెడ్డి రామిరెడ్డి, ఎంఈవోలు యూవీ నారాయణరెడ్డి, ఆర్‌ శ్రీనివాసులు, సంజీవి, రాజాల కొండారెడ్డి, సుబ్బారావు, కరుణకుమారి, రమణయ్య, డీ ప్రసాద్‌, జే ప్రసాద్‌ లు ఉన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 10:46 PM