పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ABN , Publish Date - Feb 18 , 2025 | 11:19 PM
నిబంధనలు ఉల్లంఘించి సీసీ రోడ్లకు సంబంధించిన ఉపాధి హామీ నిధులు డ్రా చేసిన పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అద్దంకి మండలంలోని చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణం చేశారు. ఈ పనులకు సంబంధించి టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌స 30శాతం మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.15,74,283 విలువైన సామగ్రిని సరఫరా చేశారు.
నిబంధనలు ఉల్లంగించి ఉపాధి ద్వారా వేసిన సీసీ రోడ్ల
నిధులు డ్రా చేసిన వైనం
ఇప్పటికే చినకొత్తపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు
అద్దంకి, ఫిబ్రవరి 18 (ఆంద్రజ్యోతి) : నిబంధనలు ఉల్లంఘించి సీసీ రోడ్లకు సంబంధించిన ఉపాధి హామీ నిధులు డ్రా చేసిన పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అద్దంకి మండలంలోని చినకొత్తపల్లి పంచాయతీ పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణం చేశారు. ఈ పనులకు సంబంధించి టీడీపీ నేత మానం మురళీమోహన్‌దా్‌స 30శాతం మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.15,74,283 విలువైన సామగ్రిని సరఫరా చేశారు. అందుకు సంబంధించి 2021 సెప్టెంబరు 3న రూ.15,74,283 ప్రభుత్వం నుం చి వి డుదలయ్యాయి. ఈ నిధులను టీడీ పీ నేత మానం మురళీమోహన్‌దా్‌సకు చె ల్లించాల్సి ఉండగా అప్పటి పంచాయతీ కార్యదర్శి ( ప్రస్తుతం సంతమాగులూరు మండలం పాతమాగులూరు పంచాయతీ కార్యదర్శి) ఈశ్వరరెడ్డి, సర్పంచ్ గుజ్జుల మల్లిక నేరుగా డ్రా చేసి సర్పంచ్ సోదరుడు చంద్రగిరి వీరారెడ్డికి చెల్లించారని మురళీమోహన్‌దా్‌స అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త మురళీమోహన్‌దాసు మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చీరాల డీఎల్‌పీవో శివనారాయణ డిసెంబరు 18వ తేదీన వి చారణ చేపట్టి సర్పంచ్ మల్లిక, అప్పటి పంచాయతీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి బ్యాంక్ నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. 3 నెలల పాటు సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు వారం కిందట ఉత్తర్వులు ఇ చ్చారు. అప్పటి చినకొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి (ప్రస్తుత సంతమాగులూరు మండలం పాతమాగులూరు కార్యదర్శి) ఈశ్వరరెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.