Share News

మిగులు ఎయిడెడ్‌ టీచర్లు 205 మంది!

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:28 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 205 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు సర్‌ ప్లస్‌ (మిగులు)గా ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌-1 ప్రకారం ఈమేరకు తేల్చారు.

మిగులు ఎయిడెడ్‌ టీచర్లు  205 మంది!

జీవో నంబర్‌-1 ప్రకారం

తేల్చిన విద్యాశాఖ అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 205 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు సర్‌ ప్లస్‌ (మిగులు)గా ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌-1 ప్రకారం ఈమేరకు తేల్చారు. ఎర్రగొండపాలెం మండలంలో 8 మంది, మార్కాపురంలో 14, అర్ధవీడులో 3, కొమరోలులో 16, రాచర్లలో 5, గిద్దలూరులో 18, కంభంలో 18 మంది, పుల్లలచెరువులో 3, వెలిగండ్లలో 7, హనుమంతునిపాడులో 5, కనిగిరి మండలంలో ఏడుగురు ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. దర్శి మండలంలో 3, దొనకొండలో 5, ఒంగోలులో 20 మంది, కొత్తపట్నంలో 3, మద్దిపాడులో ఒకరు, నాగులుప్పలపాడు మండలంలో 24మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు సర్‌ప్లస్‌గా ఉన్నారు. వేటపాలెం మండలంలో 3, చీరాలలో 20 మంది, పర్చూరులో 3, ఇంకొల్లు 10 మంది, యద్దనపూడిలో 4, జె.పంగులూరులో 4, అద్దంకి మండలంలో నలుగురు ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. వీరందరి సీనియారిటీ జాబితాను తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్రావు, సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డిలు ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Feb 15 , 2025 | 11:28 PM