అంకమ్మ తల్లి విగ్రహానికి సూర్యకిరణాభిషేకం
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:43 AM
మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు.

మార్టూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ద్రోణాదుల గ్రామంలో అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో గురువారం ఉదయం అంకమ్మ తల్లి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మార్చిలో అమ్మవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయంలో ఈ దృశ్యాన్ని భక్తులు చూసి పరవశించిపోయారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.