ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jan 28 , 2025 | 02:04 AM
తన పొలానికి సంబంధించిన పత్రాలను సోదరులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఒంగోలులో ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన మహిళ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. త్రిపురాంతకం మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పేరం సౌభాగ్యం తన పొలానికి సంబంధించిన పలుపత్రాలను సోదరులు తీసుకున్నారని, వాటిని ఇప్పించాలని కోరుతూ రెండేళ్ల క్రితం స్థానిక పోలీసులను ఆశ్రయించి నట్లు సమాచారం.
న్యాయం చేయాలంటూ ఎలుకల మందు తిన్న మహిళ
రిమ్స్ వైద్యశాలకు తరలించి చికిత్స
నిలకడగానే బాధితురాలి ఆరోగ్యం
ఒంగోలుక్రైం/త్రిపురాంతకం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : తన పొలానికి సంబంధించిన పత్రాలను సోదరులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఒంగోలులో ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన మహిళ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. త్రిపురాంతకం మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పేరం సౌభాగ్యం తన పొలానికి సంబంధించిన పలుపత్రాలను సోదరులు తీసుకున్నారని, వాటిని ఇప్పించాలని కోరుతూ రెండేళ్ల క్రితం స్థానిక పోలీసులను ఆశ్రయించి నట్లు సమాచారం. నెలరోజుల క్రితం ఎస్పీ కార్యాలయంలో ఇదే విషయమై ఫిర్యాదు చేసింది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక సీఐకి ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందా యి. దీంతో సీఐ ఇరువర్గాలనూ పిలిచి విచారించారు. సరైన పత్రాలు ఇద్దరికీ లేవని, విషయాన్ని న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో సౌభాగ్యం మళ్లీ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చారు. తనకు త్రిపురాంతకం పోలీసులు న్యాయం చేయడం లేదని.. మీరైనా పట్టించుకోవాలని కోరుతూ ఎలుకల మందు తినింది. అక్కడు న్న పోలీసులు గమనించి వెంటనే బాధితురాలిని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా ఆత్మహత్యాయత్నంపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో సౌభాగ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్‌కుమార్ తెలిపారు.