Share News

అగ్రవర్ణాల్లోని పేదలకూ సబ్సిడీ రుణాలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:07 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల తరహాలోనే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను ఇస్తోంది. వారు స్వయం ఉపాధి యూ నిట్లు స్థాపించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రుణాలను మంజూరు చేస్తోంది.

అగ్రవర్ణాల్లోని పేదలకూ సబ్సిడీ రుణాలు

బీసీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరు

జిల్లాకు 568 యూనిట్లు కేటాయింపు

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఒంగోలు నగరం, జనవరి 6 (ఆంధ్ర జ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల తరహాలోనే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను ఇస్తోంది. వారు స్వయం ఉపాధి యూ నిట్లు స్థాపించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ రుణాలను మంజూరు చేస్తోంది. 50శాతం సబ్సిడీ ప్రకటించింది. జిల్లాకు మొత్తం 568 యూనిట్లను కేటాయించింది. వీటిలో స్వయం ఉపాధి యూనిట్లు 483, జనరిక్‌ మందుల దుకాణాలు 85 ఉన్నాయి. జనరిక్‌ మందుల దుకాణాలకు యూనిట్‌ విలువ రూ.8 లక్షలు కాగా ఇందులో రూ.4 లక్షలు సబ్సిడీ ఉంటుం ది. మిగిలిన సొమ్మును లబ్ధిదారుడు బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కులాల వారీగా ఎవరికి ఎన్ని అన్నది కూడా నిర్ణయించింది.

Updated Date - Jan 07 , 2025 | 01:07 AM