బోగస్ మస్టర్లు వేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:28 PM
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పనులకు రాకుండా వచ్చినట్లు బోగస్ మస్టర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా డ్వామా పీడీ విజయలక్ష్మి హెచ్చరించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఇటీవల పెద్ద ఎత్తున బోగస్ మస్టర్లు వేయాలని ఉపాధి సిబ్బం ది క్షేత్ర సహాయకులపై ఒత్తిడి తెస్తున్నారని వచ్చిన వార్తలు, మస్టర్ల విషయమై సిబ్బంది మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి

డ్వామా పీడీ విజయలక్ష్మి
మూడు గ్రామాలలో ఉపాధి పనుల తనిఖీ
కొద్ది రోజులుగా సిబ్బందిపై ఆరోపణలు
బల్లికురవ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పనులకు రాకుండా వచ్చినట్లు బోగస్ మస్టర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా డ్వామా పీడీ విజయలక్ష్మి హెచ్చరించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఇటీవల పెద్ద ఎత్తున బోగస్ మస్టర్లు వేయాలని ఉపాధి సిబ్బం ది క్షేత్ర సహాయకులపై ఒత్తిడి తెస్తున్నారని వచ్చిన వార్తలు, మస్టర్ల విషయమై సిబ్బంది మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ట తేజ ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట బల్లికురవ మండలానికి స్టేట్ విజిలెన్స్ అధికారులు వచ్చి సిబ్బందిని విచారించారు. వారి ఇ చ్చిన నివేదికల మేరకు బుధవారం మం డలం ఉప్పుమాగులూరు, బల్లికురవ గ్రా మాలకు పీడీ, కూకట్లపల్లి గ్రామానికి జిల్లా విజిలెన్స్ అఫీసర్ శోభన్ వచ్చి కూలీలు చేస్తున్న పనులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈసందర్భంగా మూడు గ్రామాలలో క్షేత్ర సహాయకుల వద్ద ఉన్న ఫోన్లను నిలుపుదల చేసి మస్టర్‌లను చెక్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా కూలీలు పనులకు రాకుండా వచ్చినట్లు మస్టర్ వేస్తే క్షేత్ర సహాయకులపై చర్యలు తప్పవన్నారు. అలానే ఉపాధి పనులను పర్యవేక్షించే సిబ్బంది ప్రతి రోజూ పనులను పరిశీలించాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా పనులలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పీడీ అన్ని గ్రామాల క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా అమె మాట్లాడుతు లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించాలన్నారు. రోజు కూలి రూ.300 తగ్గకుండా పనులు చేయాలన్నారు. సిబ్బంది నగదు కోసం ఒత్తిడి తెస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక్కో గ్రామంలో 15 ఫారం ఫాండ్సును ఏర్పాటు చేయాలని పీడీ సూచించారు. సమావేశంలో ఎంపీడీవో కుసుమకుమారి, ఏపీడీ కోటయ్యనాయక్ పాల్గొన్నారు.