స్టాకు నిర్వహణ పారదర్శకంగా చూడాలి : జేసీ
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:00 AM
రేషన్ స్టాకు డీలర్‌లకు జాగ్రత్తగా చేర్చడమే కాకుండా పారదర్శకంగా ప్రజలకు అందించాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్ అన్నారు. శుక్రవారం వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేటలోని ఎంఎల్‌సీ స్టాకు పాయింట్‌ను జేసీ పరిశీలించారు.
వేటపాలెం(చీరాలటౌన్), జనవరి31 (ఆంధ్రజ్యోతి) : రేషన్ స్టాకు డీలర్‌లకు జాగ్రత్తగా చేర్చడమే కాకుండా పారదర్శకంగా ప్రజలకు అందించాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్ అన్నారు. శుక్రవారం వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేటలోని ఎంఎల్‌సీ స్టాకు పాయింట్‌ను జేసీ పరిశీలించారు. అక్కడ రికార్డులను నిశితంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జేసీ వెంట డీఎ్‌సవో విలియమ్స్, తహసీల్దార్ గోపీకృష్ణ, సివిల్‌సప్లయ్ డీటీ గీత ఉన్నారు.