నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:08 AM
ప్రభుత్వం ధాన్యం కొనుగోలును చేపట్టడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు కూడా పెంచారు. అయితే గత వారం రోజులుగా అద్దంకి ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవఛింతో బయట మార్కెట్‌లో పెరిగిన ధరలు మరలా తగ్గుతాయేమోనని రైతు లు అందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లాకు కేటాయించిన 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి అయింది.

ప్రభుత్వం కొనడం ప్రారంభించడంతో
బహిరంగ మార్కెట్ లోనూ పెరిగిన ధర
తాత్కాలికంగా ఆపడంతో
ధరలు తగ్గుతాయని రైతుల్లో ఆందోళన
అద్దంకి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ధాన్యం కొనుగోలును చేపట్టడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు కూడా పెంచారు. అయితే గత వారం రోజులుగా అద్దంకి ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవఛింతో బయట మార్కెట్‌లో పెరిగిన ధరలు మరలా తగ్గుతాయేమోనని రైతు లు అందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లాకు కేటాయించిన 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి అయింది. అదే సమయంలో అద్దంకిలో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్‌మిల్‌లో కూడా ఇప్పటికే పరిమితికి మించి కొనుగోలు చేయ డంతో చేతులెత్తేసినట్లు తెలుస్తుంది. సాగర్ ఆయకట్టు లో అద్దంకి ప్రాంతంలో వరినాట్లు ఆలస్యంగా వేయడంతో ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో కొనుగోలుకు బ్రేక్ పడడంతో రైతులలో అయోమయం నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో నెల రోజుల క్రితం ధాన్యం బస్తా 1400 రూపాయలు కాగా, ప్రభుత్వం 1740 రూపాయలు చొప్పున కొనుగోలు చేసింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో కూడా ప్రస్తుతం 1700 రూపాయలకు చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే రైస్ మిల్ నిర్వాహకులు కొనుగోలు నిలిపి వేయడంతో రైతులు బయట మార్కెట్‌లో అమ్ముకునేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని అసరాగా తీసుకున్న దళారులు ధర లు తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. బయట మార్కెట్‌లో అమ్ముకుంటే చెల్లింపులు ఆలస్యం కావంతో పాటు, నగదు కు గ్యారెంటీ కూడా ఉండే పరిస్థితి లేకపోవడం, గతంలో పలువురు దళారులు ధాన్యం కొనుగోలు చేసి బిసానా ఎత్తివేసిన సందర్బాలు కూడా ఉండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు వెంటనే పునః ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.
మిల్లు దగ్గరకు తోలినా పర్మిషన్ రాలేదని కాటా వేయలేదు
ధాన్యం ను 10 రోజుల కిందట అద్దంకిలోని రైస్‌మిల్ వద్దకు తీసుకెళ్లాను. గతంలో ఇచ్చిన టార్కెట్ పూర్తయిందని, మరలా అనుమతులు రాలేదని ధాన్యంను 10 రోజులుగా కాటాలు కూడా వేయలేదు. బయట మార్కెట్‌లో దళారులను నమ్మలేక ప్రభుత్వం అనుమతించిన మిల్‌లోనే అమ్ముకుందామనుకుంటే ఆలస్యం అవుతుంది. వెంటనే కొనుగోలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
- బొబ్బాల లక్ష్మీనారాయణ, రైతు, కొమ్మినేనివారిపాలెం, బల్లికురవ మండలం